Thursday, January 1, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ గంగ పాత్రలో..

పవర్‌ఫుల్‌ గంగ పాత్రలో..

- Advertisement -

యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌ -అప్స్‌’. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కియారా అద్వానీ, హుమా ఖురేషి పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేసిన మేకర్స్‌ తాజాగా గంగ పాత్రలో నటిస్తున్న నయనతార పాత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌లో నయనతార అందంగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. యశ్‌ చేస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఈ ఫస్ట్‌లుక్‌ చెప్పకనే చెబుతోంది. చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాను ఇంగ్లీష్‌, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నాం.

అలాగే ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో అనువాదం చేసి, విడుదల చేస్తున్నాం. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇక గంగగా నయనతార నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారు’ అని అన్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ నిర్మిస్తున్నారు. ఈద్‌, ఉగాది, గుడి పడ్వా పండగలు కలిసి వచ్చేలా ఈ చిత్రాన్ని మార్చి 19న మేకర్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -