Sunday, December 14, 2025
E-PAPER
Homeకవితబడి మడిలో

బడి మడిలో

- Advertisement -

అక్షరాలు వెదజల్లీ బడి మడిలో సేద్యం చేస్తా
జాతి భవితను నిర్దేశంచే ఆశయాల పంటలు దీస్తా
పాఠశాల పంటచేలు ప్రగతిరథ చక్రాలంట
ప్రజాస్వామ్యం పంటచేలు ప్రక్షాళన కావాలంట
ప్రజల నుండి ప్రజల కొరకు అక్షరసత్యం కావాలంట
పదికాలాలు నిలవాలంట
అన్నదాతల ఆత్మహత్యలు పాలకుల పాపాలంట
పేదరికం నిరుద్యోగము ఇంకెంతకాలం వర్ధిల్లాలంట
అంతటా అందరూ అయ్యవార్లే అయితే
కోడి జాడ ఏమైందంట
ఇజాల పరదాల మాటున
నిజాల పాతర ఎన్నాళ్ళంట
దేశం దేహం అంతా కుళ్ళి కంపు కొడుతుంటే
పాలకులంతా పాపాల భైరవులై
ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తుం
ప్రశ్నించే గొంతులు మొలవాలంట
ప్రజల నుండి పరివర్తన రావాలంట
ప్రక్షాళన జరగాలంట
పుట్టుకతోనే పుచ్చుబుద్దుల
రేపటి పౌరులు రావద్దంట
నెత్తురు మండే శక్తులు నిండే
మానవమూర్తులు రావాలంట
ఆ కాలం అదెంత దూరమో
ఆ మార్గం అదెంత కఠినమో
అయినా నే సేద్యం చేస్తూ ఉంటా
సమతా లోకం స్వప్నిస్తుంటా
జిట్టా భాస్కర్‌ రెడ్డి, 9704441982

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -