Monday, December 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురెండో దశలో.. 415 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

రెండో దశలో.. 415 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

- Advertisement -

అత్యధికంగా కామారెడ్డిలో 44… అత్యల్పంగా ఆసీఫాబాద్‌లో 1
8,304 వార్డు స్థానాలు ఏకగ్రీవం
అత్యధికంగా కామారెడ్డిలో 776, అత్యల్పంగా వనపర్తిలో 97
ఎన్నికలు జరిగే పంచాయతీ స్థానాలు 3.836
సర్పంచ్‌ బరిలో 13,128 మంది అభ్యర్థులు
డిసెంబర్‌ 14న ఎన్నికలు, ఆదే రోజు లెక్కింపు, ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో 193 మండలాల్లోని 4,332 పంచాయతీలు, 37,440 వార్డులకు మొదటి దశలో నిర్వహిచే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తుది వివరాలను ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం వెల్లడించారు. అత్యధికంగా కామారెడ్డిలో 44, ఈ తర్వాత నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 33 చొప్పున, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో 23 చొప్పున సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. అత్యల్పంగా కుమరంభీం ఆసీఫాబాద్‌లో1, ఆ తర్వాత మంచిర్యాలలో2, పెద్దపల్లిలో 3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమ య్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వార్డుల వారీగా రెండో దశలో మొత్తం 38,322 వార్డుల్లో 8,304 ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా కామారెడ్డిలో 776, ఆ తర్వాత నిజామాబాద్‌లో 674, నల్లగొండలో 553, అత్యల్పంగా వరంగల్‌లో 97, ఆ తర్వాత మంచిర్యాలలో 11, హన్మకొండలో 120 వార్డులు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం 4,332 పంచాయతీల్లో 395 ఏకగ్రీవం కాగా, 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 3,932 గ్రామల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 38,322 వార్డుల్లో 8,304 ఏకగ్రీవం కాగా, 107 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. తుది లెక్కల ప్రకారం 7,584 మంది సర్పంచ్‌ పదవికి వేసిన నామినేషన్లను ఉపసంహరిం చుకోగా, 13,128 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అలాగే మొత్తం 38,322 వార్డుల్లో 10,427 మంది నామినేషన్లను ఉపసం హరించు కోగా 78,158 అభ్యర్థులు బరిలో నిలిచారు. సర్పంచ్‌ కోసం ఒక్కో స్థానానికి 3.3 చొప్పున, వార్డులకు ఒక్కో స్తానానికి 2.5 సగటున పోటీలో ఉన్నారు. నామి నేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయించారు. ఇద్దరు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేరు, వృత్తిని పరిగణంలోకి తీసుకుని రిటర్నింగ్‌ అధికారి గుర్తును కేటాయిం చారు. డిసెంబర్‌ 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి
5గ్రామాలు, 107 వార్డులు ఎన్నికలకు దూరం ఒక్క నామినేషన్‌ దాఖలు కాని వైనం
రాష్ట్రంలో రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న 4,332 పంచాయతీల్లో 5 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 2, కొత్తగూడెం, మంచిర్యాల, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కొ గ్రామంలో పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. అలాగే 38,322 వార్డులకు గాను 107 వార్డులో కూడా ఎవరూ పోటీకి ఆసక్తి చూపక పోవడంతో ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదని ఈసీ తెలిపింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 26, ఆ తర్వాత కొత్తగూడెం జిల్లాలో 13, మంచిర్యాల, ఆసీఫాబాద్‌ జిల్లాల్లో 12 స్థానాల చొపున నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -