Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంరెండో దశలో సర్‌

రెండో దశలో సర్‌

- Advertisement -

9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు
2026 ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల : కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలను చేపట్ట నున్నట్టు కేంద్ర ఎన్నికల కమిష నర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రకటిం చారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. రెండో దశలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఉంటుందని తెలిపారు. ఈ దశలో 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను నవీకరించడం, ధ్రువీకరించడం, అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రక్రియ చేపడుతోందని అన్నారు. ఎన్నికల జాబితా నాణ్యతపై రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికలకు ముందు లేవనెత్తుతున్నందున ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపట్టడం అవసరమైందని తెలిపారు. 1951 నుంచి 2004 వరకూ ఎనిమిది సార్లు ఎస్‌ఐఆర్‌ నిర్వహించామని, చివరిసారిగా 21 ఏండ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ఇటీవల బీహార్‌లో తొలి విడత ఎస్‌ఐఆర్‌ పూర్తి చేసినట్టు చెప్పారు.

ఎస్‌ఐఆర్‌ రెండో దశ షెడ్యూల్‌ ఇదే
ఎస్‌ఐఆర్‌ రెండో దశ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకూ ప్రింటింగ్‌/ ట్రైనింగ్‌ ఉంటుంది. నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 4 వరకూ హౌస్‌ టు హౌస్‌ ఎన్యూమరేషన్‌ ఫేజ్‌ ఉంటుంది. డిసెంబర్‌ 9న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేస్తుంది. డిసెంబర్‌ 9 నుంచి 2026 జనవరి 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. హియరింగ్‌/వెరిఫికేషన్‌ ప్రక్రియ డిసెంబర్‌ 9 నుంచి 2026 జనవరి 31 వరకూ జరుగుతుంది. 2026 ఫిబ్రవరి 7న తుది ఎన్నికల జాబితా విడుదల కానుంది.

ఎస్‌ఐఆర్‌ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలివే
రెండో విడత ఎస్‌ఐఆర్‌ జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, గోవా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, రాజస్థాన్‌ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, పుదుచ్చేరి ఉన్నాయి. వీటిలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2026లో ఎన్నికలు జరగనున్న అసోంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా ప్రకటిస్తామని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. పౌరసత్వ చట్టంలోని ప్రత్యేక నిబంధన అసోంకు వర్తిస్తుందని అన్నారు. పౌరసత్వ చట్టం ప్రకారం అసోంలో పౌరసత్వం కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వాన్ని తనిఖీ చేసే ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. జూన్‌ 24 నాటి ఎస్‌ఐఆర్‌ ఆదేశం మొత్తం దేశానికి సంబంధించినదని, అటువంటి పరిస్థితుల్లో ఇది అసోంకు వర్తించదని తెలిపారు. కాబట్టి అసోంకు ప్రత్యేక సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని, ప్రత్యేక ఎస్‌ఐఆర్‌ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించే అధికార టీఎంసీ ఉన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణకు తావులేదని అన్నారు. ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి అడ్డంకి లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ విధులను నిర్వర్తిస్తుందని అన్నారు. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘానికి అవసరమైన సిబ్బందిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కేరళలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వాయిదా వేయాలనే డిమాండ్‌పై సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇంకా జారీ చేయలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -