Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడతెరిపి లేకుండా వర్షాలు.. 

ఎడతెరిపి లేకుండా వర్షాలు.. 

- Advertisement -

– పొంగి పొర్లుతున్న వాగులు వంకలు..
– వరద నీటిలో బైకుతో పాటు కొట్టుకుపోయిన వ్యక్తి..
– సురక్షితంగా బయటికి తీసిన రాంరెడ్డిపల్లి గ్రామస్తులు..
నవతెలంగాణ – ఊరుకొండ 
: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు కుంటలు నుండి అక్కడక్కడ చెరువు కట్టలు తెగి నీరు వరదలై పారుతుంది. ఈ క్రమంలో ముచ్చర్లపల్లి – రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య బీటి రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటికి.. కేశంపేట మండలం పెద్దదిరాల గ్రామానికి చెందిన మారుపాకుల ప్రవీణ్ ముచ్చర్లపల్లి గ్రామానికి బైక్ పై వెళుతుండగా.. వరద తాటికి బైక్ తోపాటు తాను కూడా వర్ధనీటిలో కొట్టుకుపోతుండగా గ్రామానికి చెందిన సుజీవన్ రెడ్డి, కొంతమంది యువకులు బైక్ ను మరియు అతన్ని బయటకు తీసినట్లు స్థానికులు తెలిపారు. ఎంతో ఆశతో మండలంలోని ప్రజలు, రైతన్నలు సాగుచేసిన పంటలు ఎడతెరిపిలేని వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేలు వర్షపు నీటిలో మునిగిపోయింది. కొన్ని గ్రామాల్లో చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదంలో ఉన్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -