- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పద్మనగర్ కాలనీ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనుబంధ గ్రామంగా ఉన్నప్పుడు దాదాపు 9 సంవత్సరాల క్రితం పద్మ నగర్ గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. కానీ 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఆ భవన నిర్మాణం పిల్లర్ల వద్దే నిలిచిపోయింది. అంగన్వాడి కేంద్రానికి పక్కా భవనం లేకపోవడంతో ఈరోజు వరకు అద్దె భవనంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత కొంత కాలం క్రితం మళ్లీ ఈ భవనానికి మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించి మళ్లీ పనులకు భూమి పూజ నిర్వహించారు. కానీ ఇప్పటివరకు అంగుళం కూడా పని జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
- Advertisement -