నెమ్మదిగా నెమ్మదిగా మీఅంత: చేతనలో ఏవేవో ఆలోచనలు చోటు చేసు కుంటుంటాయి మణి వడ్లమాని గారు రాసిన ఈ కథలు చదివాక. కొన్ని కథల్లో ఉండే అవ్యక్తమైన భావజాలాలైతే మనలో ఎక్కడో పాతుకుపోయిన విభిన్న భావాల్ని తట్టిలేపుతూ, అంతర్గతంగా ఎన్నెన్ని యుద్దాలు చేస్తున్నామో కదా! మనల్ని మనం దిద్దుకోవడానికి అనే సత్యాన్ని చూచాయగా చెబుతూనే, మరికొన్ని కథల్లో మనిషి యొక్క స్వభావాల్ని, వాటి వెనుక దాగి ఉండే రూట్ కాజెస్‌ని బహిర్గతం చేస్తూ సాగుతాయి.
కథంటే కేవలం కొన్ని సన్నివేశాల సమాహారం అనే స్థాయి నుంచి, కథంటే కొన్ని శతాబ్దాల పాటు వేధించే ఒక గాయం, ఒక అవ్యక్త మధురగీతం, దుఃఖంలో కూరుకుపోయిన మనసుకు అందించే ఓ అదుÄతే ఔషధం అనే ఉన్నతిని చేరుకోవడానికి తెలుగు కథకు చాలా కొద్ది కాలమే పట్టింది. ఆ తరువాత దాన్ని అందిపుచ్చుకుని మరోతరానికి తమ కథలతో దారితెన్నులు తెలియజేస్తూ,వయసును, ఆర్ధిక శ్రేయస్సును అన్నింటినీ పణంగా పెట్టి ఇంకా రాస్తూనే ఉన్నారు కొంతమంది రచయితలు. వారి కోవకి చెందినవారే మణి గారు. తన కథలతో. తన ఆలోచనలతో, మరికొన్ని తనవైన విభిన్న భావాలను మిళితం చేసి రాసిన ఈ ‘అసంగత’ అనే కథా సంపుటి ఇప్పుడు రాస్తున్న యువ రచయితలందరూ తప్పక చదవాల్సిన చక్కని పుస్తకం. ఇందులోని మొదటి కథలోవంశీ అనే పెయింటర్ గీసే వర?చిత్రాలు రచయిత ఆ కథ చివరి వాక్యంలో చెప్పినట్టు నీరవ రాత్రులకీ, నిశబ్దాలకీ రుజువుల్లానే అనిపిస్తాయి. అక్కడ్నించిఆఖరి కథ వరకూ కొన్ని రహస్యాలని, కొన్ని జ్ఞాపకాల నైరూప్యతలని, కొన్నిసార్లు మన లోపల పేరుకుని ఉన్న అనవసరాలనీ మన ముందు తారాట్లాడేలా చేసే కథలుఈ ‘అసంగత’ నిండా పరుచుకుని ఉన్నాయి.మనతో మన సబ్ కాన్షియస్ మైండ్ ఆడే ఆటల్ని, వాటి పర్యవసానాల్ని పూర్తిగా స్టడీ చేసి అందులోంచి అల్లిన ఈ కథల్ని, పాఠకులందరూఆశ్వాదిస్తూ తమని తాము విశ్లేషించుకుంటారని ప్రగాడముగానమ్ముతున్నాను.
వెంకట్ ఈశ్వర్, 8297258369



