Wednesday, July 16, 2025
E-PAPER
Homeబీజినెస్ఎగుమతుల్లో పెరుగుదల

ఎగుమతుల్లో పెరుగుదల

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లోని జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత ఎగుమతులు 6 శాతం పెరిగి 210.31 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 198 బిలియన్ల ఎగుమతులు చోటు చేసుకున్నాయి. గడిచిన క్యూ1లో వాణిజ్య లోటు 9.4 శాతం తగ్గి 20.3 బిలియన్లకు చేరుకుంది. సేవల ఎగుమతులలో సుమారు 11 శాతం వృద్ధి చోటు చేసుకోవడంతో వాణిజ్య లోటు తగ్గుదలకు దోహదం చేసిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం క్యూ1లో సర్వీసు సెక్టార్‌ ఎగుమతులు 11 శాతం పెరిగి 98.1 బిలియన్లకు చేరాయి. 2024-25 ఇదే త్రైమాసికంలో 88.5 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన క్యూ1లో సరుకుల ఎగుమతులు 2 శాతం పెరిగి 112.2 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. మరోవైపు మొత్తం దిగుమతులు 4.4 శాతం పెరిగి 230.6 బిలియన్లకు చేరాయి. ఇందులో వస్తు దిగుమతులు 4.2 శాతం, సేవల దిగుమతులు 4.9 శాతం చొప్పున పెరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -