నవతెలంగాణ-హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై సోమవారం మరోసారి సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. సినీ కార్మికుల సంక్షేమానికి 20శాతం ఇస్తేనే టికెట్ ధరల పెంచుతామని షరతు విధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.సంధ్య థియేటర్ ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తాను, ముఖ్యమంత్రి ప్రకటించిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే అందరం చర్చించిన అనంతరం సవరణ చేశామని అన్నారు.
ఒకవేళ టికెట్ ధరలు పెంచాల్సి వస్తే సినీ కార్మికుల సంక్షేమానికి 20 శాతం ఇవ్వాలని షరతు విధించామని అన్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని సినిమాలకు టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చామని అన్నారు. ఇచ్చాం. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల దఅష్ట్యా నల్గండ, భువనగిరి జిల్లాలను పర్యవేక్షిస్తున్నానని, అప్పుడే జీవో ఇచ్చారని అన్నారు. గతంలోనూ, ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదనిఇటీవల మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.



