నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీసీలకు లోకల్‌బాడీ ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులతో కలిసి గురువారం పార్లమెంట్‌లో ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల సర్వే తీరు, శాసనసభలో బిల్లుల ఆమోదం విషయాలను ఆయనకు వివరించారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని ప్రస్తావించారు. ఖర్గేను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, గడ్డం వివేక్ వెంకట స్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఉన్నారు.
పార్లమెంట్‌లో ఒత్తిడి పెంచండి : ఖర్గేకు సీఎం లేఖ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES