Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొగ్గులవాగు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

బొగ్గులవాగు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతరహా ప్రాజెక్టులైన కాపురంపల్లెలోని కాపురం చెరువు,ఎడ్లపల్లి గ్రామపరిదిలో అటవీప్రాంతంలో ఉన్న బొగ్గులవాగు ప్రాజెక్టు లకు మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే కాపురం చెరువు నిండుకుండలా నిండుకొంది.ఏ క్షణంలో అలుగు పడేది తెలియదని ఆయకట్టు రైతులు తెలుపుతున్నారు. బొగ్గులవాగు ప్రాజెక్టులో వరద నీరు చేరుతోంది. రాత్రి వేళలో ఇలాగే వర్షం, వరద కొనసాగితే ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పడడం ఖాయమని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరంలో ఈ రోజు భారీ వర్షం కురియడంతో కొయ్యుర్ లోని బొగ్గులవాగు, మల్లారంలోని అరేవాగులు పొంగి పొర్లుతున్నాయి. కుంటలు, చెరువుల్లో నీరు చేరుతోంది. పొలాలు,పత్తి పంటల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తాడిచర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇంటి గోడలు,ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -