నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు అయిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లో గల తన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2030 నాటికి 100 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికతో ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. సంస్థ వృద్థికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన కోరారు. ‘నయా భారత్’ థీ¸మ్‌ను ప్రతిబింబిస్తూ ఈ సందర్భంగా ఉద్యోగులు ఆపరేషన్ సిందూర్‌కు నివాళులర్పించాయి, అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ వినరు కుమార్, ప్రొడక్షన్ డైరెక్టర్ జోరుదీప్ దాస్‌గుప్తా, హెచ్‌ఆర్ డైరెక్టర్ ప్రియదర్శిని గడ్డం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్‌ఎండీసీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES