నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా క్లబ్ ఆవరణలో అధ్యక్షులు అంతడుపుల రామకృష్ణ జాతీయ జండా ఆవిష్కరించారు. ఇటీవల జర్నలిస్టు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ & బిల్డర్స్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మంతం మధు బహుమతులు అందజేశారు.
నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలతో ఒత్తిడులు దూరం అవుతాయని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మంతం మధు అన్నారు. జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.