Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుSJWHRC ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

SJWHRC ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ మహా నగరం, కింగ్ కోటిలో ఉన్న ” తెలంగాణ సరస్వతి పరిషత్”లో జాతీయ చైర్మన్ డా, కొప్పుల విజయ్ కుమార్ సమక్షంలో ఘనంగా 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్, ల్యాండ్ ఎక్స్పర్ట్ , తెలంగాణ అగ్రికల్చర్-ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు యం.సునీల్ కుమార్ (భూమి), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మత్తయ్య, దళితరత్న యస్.రాజు, ప్రముఖ సైకాలజిస్ట్ & హిప్నో థెరపిస్ట్ డా. హిప్నో పద్మ కమలాకర్, తెలంగాణ హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ కడారి రమేష్, హాజరయ్యారు.

ఈ సందర్భంగా భూమి సునీల్ కుమారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, అనగారిన వర్గాల కోసం ప్రతి ఒకరు నిరంతరం కృషి చేయాలన్నారు. రైతు లేనిదే మనకు అన్నం లేదు అన్నారు. రైతన్నకు అండగా, శ్రమ జీవికి తోడుగా వారి హక్కుల పరిరక్షణ కోసం మనము అందరం పని చేయాలని పిలుపునిచ్చారు. డా హిప్నో పద్మ కమలాకర్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం మానవత్వానికి ప్రతికగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అందరికీ మార్గదర్శకంగా ఉంటూన్న డా కొప్పుల విజయ్ కుమార్‌కి, వారి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

light

సమాజంలో రేపటి వెలుగుల కోసం డా. కొప్పుల విజయ్ కుమార్ ఒక అడుగు ముందుకు వేస్తే అయిన వెనుక వేలాది మంది అడుగులు పడుతున్నాయని తెలిపే ఓ గొప్పా మంచి సందేశాత్మకమే ఈ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని కొనియాడారు. న్యాయవాది కడారి రమేష్ మరియు చీఫ్ అడ్వైసర్ డా .మార్గం విజయ్ పటేల్ మాట్లాడుతూ డా.బి. ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం మన కొప్పుల విజయ్ కుమార్ గారి అడుగుజాడల్లో ఎంతోమంది నడవడం అభినందనీయం అన్నారు. అనంతరం డా. కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నేడు హైదరాబాద్ లో ముందస్తు వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. మానవ హక్కులు వాటి పరిరక్షణ మరియు భారత రాజ్యాంగం, విలువలు, ఉపయోగాలు గురించి వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి డా.బి.ఆర్.అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్నేహిత వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డా. జూపల్లి తిరుమల రావు, నేషనల్ చీస్ సెక్రటరీ డా. వై.ఆర్.ఆర్. మోహన్ రావు, ముఖ్య కార్యదర్శి షేక్ అమీర్ హుస్సేన్, నేషనల్ బోర్డు డైరెక్టర్ కె. రవిబాబు, తెలంగాణా జనరల్ సెక్రటరీ బి.నవీన్ కుమార్, సెక్రటరీ బి. దత్తాద్రి గౌడ్, రాష్ట్ర సమాచార హక్కు చట్ట విభాగం చైర్మన్ డా. సాప పండారి, డైరెక్టర్ మాలేపు నారాయణ, జాయింట్ డైరెక్టర్ బి.సుధాకర్, కె మధుకర్, కె. ఆదినారాయణ, కొప్పుల మనోజ్ కుమార్, పలువురు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad