నవతెలంగాణ – కంఠేశ్వర్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనం పై జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలన బారి నుండి 1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ,ఈ రోజు భారత పౌరులుకు ఏంతో ప్రాముఖ్యత ఉందని , ఎందుకంటే మనకు ఒక అందమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి వారి జీవితాలను త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవడానికి మాకు అవకాశం ఇస్తుందని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ , జవహర్లాల్ నెహ్రు , మహాత్మా గాంధీ ,సర్దార్ వల్లభాయ్ పటేల్ ,బాల గంగాధర్ తిలక్ , భగత్ సింగ, చంద్రశేఖర్ ఆజాద్ భారత దేశంలో గొప్ప స్వతంత్ర సమరయోధులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోక అరుణ్ బాబు,మెడికల్ ఆఫీసర్ డా.రాజేష్ ,పి.ఆర్.ఓ బి.రామకృష్ణ , మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES