ఆసియా క్వాలిఫయర్ పోరు డ్రా
సింగపూర్ : 2027 ఏఎఫ్‌సీ ఆసియా కప్ అర్హత టోర్నమెంట్‌లో భారత్ మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆదివారం సింగపూర్ నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో భారత్ విలువైన ఓ పాయింట్ దక్కించుకుంది. సింగపూర్, భారత్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్రథమార్థం ఆరంభంలోనే రెడ్ కార్డ్‌తో సందేశ్ జింఘాన్ సేవలను కోల్పోయిన భారత్.. అదనపు సమయంలో సింగపూర్‌కు గోల్ కోల్పోయింది. 1-0తో సింగపూర్ ముందంజ వేయగా.. భారత్ ఆశలు ఆవిరైనట్టే కనిపించాయి.
కానీ 90వ నిమిషంలో రహీమ్ ఆలీ మెరుపు గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రహీమ్ అలీకి ఇదే తొలి గోల్. అదనపు సమయంలోనూ ఇరు జట్లు గోల్ కోసం పోటీపడినా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్-సిలో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన భారత్ ఓ ఓటమి సహా రెండు మ్యాచులను డ్రా చేసుకుంది.