Thursday, December 4, 2025
E-PAPER
Homeబీజినెస్Maruti Suzuki: వన్ ఇండియా, వన్ EV ఛార్జింగ్ ప్లాట్‌ఫామ్

Maruti Suzuki: వన్ ఇండియా, వన్ EV ఛార్జింగ్ ప్లాట్‌ఫామ్

- Advertisement -




· సమీకృత చెల్లింపు ప్రయాణంతో  హోమ్ ఛార్జింగ్ మరియు పబ్లిక్ ఛార్జింగ్ సహా EV ఛార్జింగ్ అవసరాల కోసం సమగ్రమైన డిజిటల్ ప్లాట్ ఫాంతో మారుతి సుజుకీ దృఢమైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఇకో-సిస్టంను ప్రకటించింది.

· చారిత్రకమైన ఈ చర్యలో భాగంగా, ఒకే ప్లాట్ ఫాంపై నిరంతరంగా ఛార్జింగ్ అనుభవాలు కేటాయించడానికి మారుతి సుజుకీ ప్రముఖ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ (CPOs) 13^ మరియు అగ్రిగేటర్స్ తో సహకార  భాగస్వామ్యంపై సంతకం చేసింది.

· దేశవ్యాప్తంగా డీలర్ నెట్ వర్క్ లో 2000+ ప్రత్యేకమైన మారుతి సుజుకీ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల ఛార్జింగ్ అవసరాలు  దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన భాగస్వామి నిర్వహించే  ఛార్జింగ్ నెట్ వర్క్ ద్వారా మరింత మద్దతు చేయబడతాయి.

· 2030 నాటికి 1,00,000 +పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించడానికి మారుతి సుజుకీ తన భాగస్వాములతో కలిసి పని చేస్తుంది.

· అమోఘమైన EVఛార్జింగ్ నెట్ వర్క్ ను ప్రదర్శించడానికి, ‘e driveలో భాగంగా ’నాలుగు e VITARAలు నాలుగు దిశల్లో గురుగ్రామ్ లో ప్రారంభించబడ్డాయి- అవి ఉత్తర భారతదేశంలో శ్రీనగర్, దక్షిణంలో కన్యాకుమారి, పశ్చిమ భారతదేశంలో ద్వారక మరియు తూర్పులో దిబ్రుగర్ లో ఉన్నాయి.

· 60°C నుండి-30°C,తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో, ‘ఇసక నుండి మంచు ‘వరకు తీవ్రంగా పరీక్షించబడిన e VITARAస్థిరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది, 543 కిమీ డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తోంది.

నవతెలంగాణ న్యూఢిల్లీ: 13 ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ (CPOలు) అగ్రిగేటర్స్ తో సహకార ఒప్పందాలపై సంతకాలు చేయడం గురించి మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకీ) ప్రకటించింది. ఈ ఒప్పందాలు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ నుండి హిసాషి టకేచి, మేనేజింగ్ డైరెక్టర్ & CEO, పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ & సేల్స్ CPOల నుండి ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సంతకాలు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, హిసాషి టకెఉచి, మేనేజింగ్ డైరెక్టర్ & CEO, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ “శాశ్వతమైన నమ్మకాన్ని రూపొందించడానికి మా కస్టమర్లకు ఆనందకరమైన యాజమాన్య అనుభవం అందించడానికి మారుతి సుజుకీలో మేము కృషి చేస్తున్నాము. EV ఛార్జింగ్ విచారాలు పరిష్కరించడానికి మరియు కస్టమర్ కు ఆత్మవిశ్వాసం పెంచడానికి పూర్తి సంసిద్ధతతో మేము ఎలక్ట్రిక్ ప్రయాణం విభాగంలోకి ప్రవేశించిన కారణంగా నేడు మేము ఒక చారిత్రకమైన చర్య తీసుకుంటున్నాము. మా సేల్స్ మరియు సర్వీస్ నెట్ వర్క్ లో 2,000 మారుతి సుజుకీ ప్రత్యేకమైన ఛార్జింగ్ పాయింట్లు యొక్క దృఢమైన నెట్ వర్క్ ను మేము స్థాపించాము. ఇవి 1,100 పట్టణలు కంటే ఎక్కువగా విస్తరించాయి. దేశంలో విస్తృతమైన ఛార్జింగ్ మౌళిక సదుపాయాలు అందచేయడానికి 13 ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ తో కూడా మేము అనుసంధానం చెందాము. సుజుకీ యొక్క అంతర్జాతీయ కలతో , మేము బహుళ EVలు పరిచయం చేయడానికి ప్రణాళిక చేసాము, మరియు దీనిని మద్దతు చేయడానికి, 2030 నాటికి భారతదేశంవ్యాప్తంగా 1 లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లు యొక్క నెట్‌వర్క్‌ను ప్రారంభించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము.”అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -