Wednesday, December 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ బియ్యంపై సుంకం ?

భారత్‌ బియ్యంపై సుంకం ?

- Advertisement -

సంకేతాన్నిచ్చిన ట్రంప్‌
వాషింగ్టన్‌ :
కెనడా ఎరువులు, భారత్‌ బియ్యం సహా వ్యవసాయ సంబంధమైన దిగుమతులపై తాజాగా సుంకాలు విధించే విషయాన్ని పరిశీలిం చేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంకేతం ఇచ్చారు. భారత్‌ నుంచి సబ్సిడీతో దిగుమతి అవుతున్న బియ్యం అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తోందని, ఫలి తంగా దేశంలో ధరలు పడిపోతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా రైతులు కోరుతున్నారని ట్రంప్‌ చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్న దేశాలను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. అమెరికా రైతుల కోసం 12 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు చౌక బియాన్ని అమెరికా మార్కెట్లలో డంప్‌ చేస్తున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై సుంకాలు విధించాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఎరువులపై కూడా సుంకాలు విధిస్తామని సూచనప్రాయంగా అన్నారు. అమెరికా ఉత్పత్తులను పెంచేందుకు భారీగా సుంకాలను విధించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. భారత్‌, థాయిలాండ్‌, చైనా వంటి దేశాలు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నాయని లూసియానాలోని కెన్నడీ రైస్‌ మిల్లు సీఈఓ మెర్లీ కెన్నడీ దేశాధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను రెట్టింపు చేయాలని ఆయన సూచించారు. కాగా విదేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి కాకుండా చూడాలని అక్కడికి వచ్చిన పలువురు రైతులు ట్రంప్‌ను కోరారు. దీంతో ఏయే దేశాల నుంచి చౌకగా సరుకులు డంపింగ్‌ అవుతున్నాయో పరిశీలించాలని ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ను ట్రంప్‌ కోరారు. చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో భారత్‌ తన ధాన్యం పరిశ్రమకు ఎలా సాయం చేస్తోందో కెన్నడీ వివరిస్తుండగా ట్రంప్‌ జోక్యం చేసుకుంటూ ‘చౌకగా సరుకులను డంపింగ్‌ చేస్తున్న దేశాల పేర్లు ఇవ్వండి. భారత్‌ అయినా… ఇతర దేశమైనా సరే. ఎవరైతే ఏమిటి?’ అని అన్నారు. భారత్‌, థాయిలాండ్‌, చైనా దేశాలను ఆర్థిక మంత్రి ఉదహరిస్తూ మరిన్ని దేశాలు కూడా అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నాయని, పూర్తి జాబితాను అందజేస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ ఈ విషయాన్ని త్వరగానే పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అమెరికాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌, కెనడా దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే చర్చలు జరుపుతున్న ప్రతినిధులు ఎలాంటి పురోగతి సాధించలేకపోతున్నారు. ఇదిలావుండగా అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయానికి చెందిన సీనియర్‌ సభ్యులు ఈ వారంలో భారత్‌తో చర్చలను తిరిగి ప్రారంభించబోతున్నారు. భారత బృందానికి వాణిజ్య కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ నేతృత్వం వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -