Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంసరిహద్దులు దాటేందుకు కూడా భార‌త్‌ సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

సరిహద్దులు దాటేందుకు కూడా భార‌త్‌ సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత ప్రజల రక్షణ, దేశ సమగ్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా నిరూపించామని ఆయన అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -