Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇజ్రాయిల్‌తో భారత్‌ అన్ని రకాల సంబంధాలను రద్దు చేసుకోవాలి

ఇజ్రాయిల్‌తో భారత్‌ అన్ని రకాల సంబంధాలను రద్దు చేసుకోవాలి

- Advertisement -

ఆ దేశ ఆర్థిక మంత్రికి అతిథ్యమివ్వడం సిగ్గుచేటు : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భటాచార్య

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇజ్రాయిల్‌ ఆర్థిక మంత్రి బెజలెల్‌ స్మాట్రిచ్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు భారత్‌కు రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భటాచార్య అని చెప్పారు. ఆయనకు భారత్‌ అతిథ్యమివ్వడం సిగ్టుచేటన్నారు. ఇజ్రాయిల్‌తో భారత్‌ అన్ని రకాలైన సైనిక, భద్రతా, ఆర్థిక సహకార సంబంధాలను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించి, పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాంతియుత పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. బెజలెల్‌ స్మాట్రిచ్‌ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీజన్‌ మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడం ద్వారా గాజాను ఆక్రమించినందుకు నెతన్యాహు ప్రభుత్వాన్ని బలపరిచే మితవాద జాత్యహంకార పార్టీకి చెందిన వ్యక్తి స్మాట్రిచ్‌ అన్నారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌ను ఇజ్రాయిల్‌లో విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనలు తొలుత చేసింది కూడా ఆయనేనని తెలిపారు. పాలస్తీనా జాతి ప్రక్షాళనకు సంబంధించిన ఆయన విస్తరణవాద విధానాల ఫలితంగా ఆయన తమ దేశానికి రాకూడదని అనేక దేశాలు నిషేధం విధించాయని గుర్తు చేశారు. ఆయనపై బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్‌, స్లొవేనియా, న్యూజిలాండ్‌ దేశాలు నిషేధించాయని తెలిపారు. అటువంటి వ్యక్తికి మోడీ ప్రభుత్వం ఆతిథ్యమివ్వడం, పైగా ప్రతిరోజూ గాజా ప్రజలు ఊచకోతకు గురవుతున్న తరుణంలో ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో ఒప్పందాలపై సంతకాలు చేయడం సిగ్గు చేటని చెప్పారు. నెతన్యాహు ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వానిది ఎంత ధఢమైన బంధమో అర్థమవుతుందన్నారు. గాజాలో కొనసాగుతున్న భయంకరమైన మారణకాండపై మోడీ ప్రభుత్వ ఉదాసీ నతతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య,కార్యదర్శులు ఎస్‌ రజినీకాంత్‌, టి. నాగరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య,కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మమత, కె.శంకర్‌, శ్రీకాంత్‌, రంజీత్‌, ఉపాధ్యక్షులు డి.కిరణ్‌, అశోక్‌ రెడ్డి, ప్రశాంత్‌, బి.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -