Wednesday, November 26, 2025
E-PAPER
Homeఆటలురెండో టెస్టులో భార‌త్ భారీ ఓట‌మి

రెండో టెస్టులో భార‌త్ భారీ ఓట‌మి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సొంతగడ్డపై జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ టీం ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్‌ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -