ట్రంప్ నోట అదే మాట
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా ఆపేస్తుందని పునరుద్ఘాటించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇంధన నిర్ణయాలు తీసుకుంటామని భారత్ పదే పదే చెబుతున్నప్పటికీ ట్రంప్ నోట అదే మాట విన్పించింది. విదేశీ పర్యటనకు వెళుతూ ఆయన ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. ”రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా ఆపేస్తుంది. మేము ఆంక్షలు విధించాం” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
రష్యాకు చెందిన రెండు ప్రముఖ చమురు కంపెనీలపై అమెరికా విధించిన తాజా ఆంక్షలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సంవత్సరాంతానికి రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ తనకు హామీ ఇచ్చిందని ట్రంప్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



