Sunday, December 7, 2025
E-PAPER
Homeజాతీయం10 నుంచి భారత్‌, అమెరికా వాణిజ్య చర్చలు

10 నుంచి భారత్‌, అమెరికా వాణిజ్య చర్చలు

- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌, అమెరికా మధ్య డిసెంబర్‌ 10 నుంచి వాణిజ్య ఒప్పంద చర్చలు జరగనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో మూడు రోజుల పాటు సాగే ఈ చర్చల్లో మొదటి విడత ఒప్పందంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఈ చర్చలకు అమెరికా తరఫున హాజరవుతున్న బృందంలో డిప్యూటీ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ రిక్‌ స్విట్జర్‌ పాల్గొననున్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు విడతలుగా సమావేశాలు జరిగాయి. అయినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుత ఏడాదిలోనే అమెరికాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం జరగొచ్చని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -