- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాత ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విండీస్.. రెండో టెస్టులో కాస్త పోరాడింది. దీంతో ఆట ఐదో రోజుకు చేరింది. 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా.. మరో రెండు వికెట్లు కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేఎల్ రాహుల్(58) అర్ధ శతకం చేయగా.. సాయి సుదర్శన్ (39), గిల్ (13) పరుగులు చేశారు.
- Advertisement -