Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ విభాగాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా బుదవారం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రమేష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని విద్య ద్వారా జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని మార్చగలమని నమ్మి ప్రతి ఒక్కరు జీవితాన్ని కొనసాగించాలన్నారు. 

తిరుగులేని పోరాటం ద్వారా అలుపెరుగని పోరాటం ద్వారా బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం పొందుతారని నమ్మి భారత రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం దక్కాలని రాజ్యాంగాన్ని ఆశయాలతో నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ 1, 2, & 3 విభాగాధిపతులు T రామకృష్ణ, కనక బాలరాజు, A ఫరీన్  మాట్లాడుతూ.. భారత రాజ్యాంగానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -