Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆస్కార్‌ బరిలో భారతీయ చిత్రాలు

ఆస్కార్‌ బరిలో భారతీయ చిత్రాలు

- Advertisement -

సినిమా రంగానికి సంబంధించి అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కోసం ఈసారి కూడా గట్టి పోటీ ఉంది. అయితే ఈ ఏడాది మన దేశం నుంచి ఏకంగా ఐదు సినిమాలు ఆస్కార్‌ బరిలో ఉండటం విశేషం. ఈ సంవత్సరం హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన రెండు చిత్రాలు ఆస్కార్‌ రేస్‌లో ఉన్నాయి. అయితే ఈ రేస్‌లో ఉన్న ‘కాంతార : చాప్టర్‌1’, ‘మహావతార్‌ నరసింహ’ చిత్రాలు మరో అడుగు ముందుకు వేశాయి. ఆస్కార్‌ అవార్డుల జనరల్‌ ఎంట్రీలో చోటు సొంతం చేసుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్‌తోపాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి ఇతర విభాగాల్లోనూ ఇవి పోటీ పడనున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబల ఫిల్మ్స్‌ ఎక్స్‌లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఆస్కార్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది.

రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో విజరు కిరగందూర్‌ నిర్మించిన ‘కాంతారా: చాప్టర్‌ 1’, అలాగే అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మహావతార్‌ నరసింహ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా, అద్భుతమైన కథ, సాంస్కృతిక ప్రామాణికత, సాంకేతిక నైపుణ్యం, విజువల్‌ గ్రాండియర్‌కు విశేష ప్రశంసలు అందుకున్నాయి. ‘కాంతార’, ‘మహావతార్‌ నరసింహ’లతోపాటు ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్‌ నుంచి మరో మూడు చిత్రాలు పోటీపడనున్నాయి. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’, ‘తన్వీ ది గ్రేట్‌’, ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ వంటి సినిమాలు ఆస్కార్‌ బరిలో నిలిచాయి. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఈ ఏడాది మార్చి 15న జరగనుంది. ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్న చిత్రాల తుది జాబితాను ఈనెల 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. లాజ్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -