ఇజ్రాయిల్ ఆస్పత్రిలో చికిత్స
జెరూసలెం: ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ ఘర్షణల కారణంగా ఇజ్రాయిల్‌లో ఓ భారత పౌరుడు గాయపడినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇరాన్ క్షిపణి నుంచి వచ్చిన శకలాలు మెడకు తగలడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడినటుఅట తెలిపారు. ఆదివారం ఈ ఘటన జరిగినటుఅట అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని టెల్ అవీవ్ ఆసఅఫత్రికి తరలించామని, అక్కడ శస్త్రచికిత్స జరిగినటుఅట తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. అయితే, బాధితుడి పేరు, ఇతర వివరాలేవీ తెలియరాలేదు. టెల్ అవీవ్‌లోని భారత ఎంబసీ అధికారులు ఆసఅఫత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, అవసరమైన సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు.



