Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు ఇండియన్ పైలట్స్ లీగల్ నోటీసు

ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు ఇండియన్ పైలట్స్ లీగల్ నోటీసు

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: అహ్మ‌దాబాద్ విమానం ప్ర‌మాదం దేశాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. టేకాప్ అయిన కొ్న్ని సెక‌న్ల లోపే మెడికో హాస్ట‌ల్స్ భ‌వ‌నంపై ఎయిరిండియా విమానం కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 241 ప్ర‌యాణికులు చ‌నిపోగా..మెడిక‌ల్ విద్యార్థులు ప‌లువురు మ‌ర‌ణించారు.ఈ దుర్ఘ‌ట‌న‌పై కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో.. పైలట్‌ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడని ప్రాథిమక నివేదిక తెలిపింది.ఈ రిపోర్టుపై పైలట్ల సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. అదే విధంగా అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల‌ను కూడా తీవ్రంగా ఖండించాయి.

తాజాగా అంతర్జాతీయ మీడియా క్షమాపణ చెప్పాలని యూనియన్లు కోరారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు లీగల్ నోటీసు జారీ చేసింది.పాశ్చాత్య మీడియాతో ప్రాథమిక నివేదికను తప్పుగా అర్థం చేసుకుందని పైలట్ సంఘాలు ధ్వజమెత్తాయి. ఇదిలా ఉంటే మీడియా కథనాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్‌టీఎస్‌బీ కూడా తీవ్రంగా ఖండించింది. ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొట్టిపారేసింది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -