- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ సిరీస్ డిసెంబర్ 21న ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, తిరిగి భారత జట్టులోకి వచ్చింది.
జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), శ్రీ చరణి, వైష్ణవి శర్మ.
- Advertisement -


