Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంట్రంప్‌ విధానాలతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం...

ట్రంప్‌ విధానాలతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం…

- Advertisement -

దేశంనుంచి విదేశీ పెట్టబడులు వెళ్లిపోతున్నాయి :
యూటీఎఫ్‌ విద్యాసదస్సులో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
నవతెలంగాణ – జనగామ

ట్రంప్‌ విధానాలతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. టీఎస్‌ యూటిఎఫ్‌ జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యాసదస్సులో ”ట్రంపు సుంకాల దాడి – కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది” అనే అంశంపై మాట్లాడారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధించేటప్పుడు ప్రపంచ పరిణామాలను సమన్వయం చేసుకుని బోధన చేయాలన్నారు. బంగారం ధర పెరగడానికి ట్రంప్‌ విధానమే ప్రధాన కారణం అన్నారు. ఈ విధానాల వల్ల భారతదేశం నుంచి విదేశీ పెట్టబడులు వెళ్లిపోతున్నాయని అన్నారు. అమెరికా ఆంక్షలు వల్ల దేశంలో రూపాయి పతనం నిరంతరం జరుగుతూనే ఉందన్నారు. భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వ ఒత్తిడి మేరకు పత్తి దిగుమతి పై ఉన్న 11 శాతం సుంకాన్ని తగ్గించిందని తెలిపారు. దీనితో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి దేశంలో పత్తి దిగుమతి అయిందన్నారు. ఈ కారణంగానే మనదేశంలో పత్తి ధర పడిపోయి రైతులు విలువిలలాడుతున్నారని అన్నారు. అమెరికా భారతదేశంపై ఒత్తిడి తీసుకు వచ్చి వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. 1970లో అమెరికాలో చేసిన చట్టం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలతో దిగుమతులు చేసుకోవాలి..కానీ ఆ చట్టాన్ని సవరించడంతో భారతదేశానికి ఆ హౌదాను తొలగించారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశం ఆర్థికంగా పూర్తిగా చతికిల పడుతున్నదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -