Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంన్యూయార్క్‌ మేయర్‌ 'నోట్‌'ను తప్పుపట్టిన భారత విదేశాంగ శాఖ

న్యూయార్క్‌ మేయర్‌ ‘నోట్‌’ను తప్పుపట్టిన భారత విదేశాంగ శాఖ

- Advertisement -

న్యూఢిల్లీ : జైలులో మగ్గుతున్న సామాజిక కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌కు మద్దతుగా న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. ”ఇతర ప్రజాస్వామ్య దేశాలలో న్యాయవ్యవస్థ స్వతంత్రను ప్రజా ప్రతినిధులు గౌరవిస్తారని మేము ఆశిస్తున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ”పక్షపాతధోరణిలో వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పదవిలో ఉన్నవారికి తగదు. అటువంటి వ్యాఖ్యలకు బదులుగా, వారికి అప్పగించిన బాధ్యతలపై దృష్టి సారించడం మంచింది” అని అన్నారు.ఉమర్‌ ఖలీద్‌ తల్లిదండ్రులు గత నెలలో అమెరికాలో మమ్దానీని కలిసినపుడు ఆయన చేతితో రాసిన నోట్‌ను అందించారు. ఖలీద్‌కు తన సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సెప్టెంబర్‌లో పోలీసులు ఉమర్‌ ఖలీద్‌ను అరెస్ట్‌ చేసినప్పటి నుండి ఆయనకు బెయిల్‌ నిరాకరించబడుతోంది. యుఎపిఎ చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -