- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ మదుపర్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం కూడా దీనికి దోహదం చేస్తోంది. ఉదయం 9.35 గంటల సమయానికి, సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో 85,186 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పుంజుకొని 26వేల మార్క్‌ను దాటి ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.
- Advertisement -