Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంప్రయాణికులకు రూ.827 కోట్లు రిఫండ్: ఇండిగో ఎయిర్ లైన్స్

ప్రయాణికులకు రూ.827 కోట్లు రిఫండ్: ఇండిగో ఎయిర్ లైన్స్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు రూ.827 కోట్లు రిఫండ్ చేసింది. మిగిలిన వారికి డిసెంబర్ 15 లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడించింది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల నవంబర్ 21 నుంచి డిసెంబూర్ 1 వరకు 9,55,591 టిక్కెట్లు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. వీటి విలువలో రూ.827 కోట్లు రిఫండ్ చేసినట్లు పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 టిక్కెట్లు రద్దు కాగా, రూ.570 కోట్లు ప్రయాణికులకు అందినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాల సర్వీసుల రద్దు వల్ల వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 9,000 బ్యాకేజీలు నిలిచిపోయినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిలో 4,500 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అందజేసినట్లు తెలిపింది. వచ్చే 36 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఇండిగో ఏర్పాటు చేస్తోంది. సోమవారం మొత్తం 500 సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -