Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం..

సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికుల నిరసనలతో హోరెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సమస్య జటిలమైన నేపథ్యంలో తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా పిటిషనర్ తరపు న్యాయవాదిని అత్యవసర విచారణ కోసం సీజేఐ తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇండిగో విమాన ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క రోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈనెల 15లోగా సమస్య పరిష్కారం అవుతుందని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -