Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగో సేవల్లో కొన‌సాగుతున్న అంత‌రాయం

ఇండిగో సేవల్లో కొన‌సాగుతున్న అంత‌రాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత , సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి . ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలను వీడుతున్నారు.

బుధవారం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లాల్సిన 19 విమానాలు, వివిధ విమానాశ్రయాల నుంచి ఆర్‌జీఐకి రావాల్సిన 21 విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. గురువారం కూడా శంషాబాద్‌ నుంచి బయల్దేరాల్సిన 33 విమానాలను అధికారులు క్యాన్సల్‌ చేసింది. అదేవిధంగా హైదరాబాద్‌కు రావాల్సిన మరో 35 విమానాలు కూడా రద్దయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇండిగోకి చెందిన 170కి విమానాలు రద్దయినట్లు తెలుస్తున్నది. కాగా, ఇండిగో ప్రతిరోజూ 2200 విమానాలను నడుపుతున్నది. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ విమానయాన సంస్థల అధికారులు, ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కారించి విమానాలను సకాలంలో నడపాలని పలువురు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -