- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా పైలట్లను నియమించుకోవడంపై ఇండిగో దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10కి 158 మంది, 2026 డిసెంబర్ కల్లా 742 మందిని తీసుకుంటామని ప్రభుత్వానికి సంస్థ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తోంది. మరో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్ల నియామకం/అప్‌గ్రేడ్ చేయనుంది’ అని తెలిపింది. కాగా ఇండిగోకు 5,456 మంది పైలట్లు ఉన్నారు.
- Advertisement -



