Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసురక్షిత ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి

సురక్షిత ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి

- Advertisement -
  • మంత్రి సీతక్క
    నవతెలంగాణ-గోవిందరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను విడతల వారీగా అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే లబ్ధిదారులు సురక్షిత ప్రాంతాల్లోనే నిర్మించుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

సోమవారం గోవిందరావుపేట మండలం మోట్లగూడెం, గ్రామానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులకు నిర్మాణ పట్టాలను జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిందని, మొదటి దఫలో చేపట్టిన ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు నిర్ణీత సమయంలో ఇండ్లను నిర్మించుకోవాలని, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల మహిళలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే బేస్మెంట్ లెవల్ కు చేరిన ఇండ్లకు సంబంధించి సొమ్ము ఖాతాలో జమ చేసామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో డిపిఓ దేవ్ రాజ్, ఎంపిడిఓలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -