Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండలంలో జోరుగా కొనసాగుతున్న ఇందిరమ్మ గృహాలు..

మండలంలో జోరుగా కొనసాగుతున్న ఇందిరమ్మ గృహాలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని మొదటి స్థానంలో జుక్కల్ మండలం ఉండడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు మండల కేంద్రంలోని ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాల కొరకు ముగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులు తప్పకుండా ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని ఈ అవకాశం మళ్లీ తమకు దక్కదని వచ్చిన వాటిని మండల ప్రజలు సద్వినియోగపరచుకుంటే చల్లని నీడ దొరుకుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఇల్లు నిర్మాణాలు చేసుకుంటే డబ్బులను మూడు విడుదలగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad