నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు భువనగిరి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులకు పరిశీలించి, మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో భాగంగా ఇంటికి నీళ్లు కొడుతున్న అతికం నర్సింహ తో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటికి నీళ్లు కొట్టారు. ఇందిరమ్మ ఇంటి మంజూరీ కోసం ఎవరికి అయినా డబ్బులు ఇచ్చారా అని అడిగితే నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదని , అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేసి ఇల్లు మంజూరు చేశారని తెలిపారు, బేస్ మెంట్ లెవల్ వరకు ఇంటి పనులు పూర్తి కాగానే డబ్బులు కూడా పడ్డాయ అని లబ్ధిదారులు కలెక్టర్ కు చెప్పారు.
నాకు పశువులు షెడ్ లేదని మంజూరు చేయమని కలెక్టర్ నీ కోరడంతో వెంటనే డిఆర్డిఓ తో ఫోన్ లో మాట్లాడి, త్వరలో షెడ్ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, మంజూరు అయినంత వరకు ఇండ్ల పనులు జరుగుతున్నాయ, ఏఏ దశలో ఉన్నాయని, పనులు జరిగినంత వరకు ఫోటో కాప్చర్ పూర్తి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు కూడా ఇండ్లు పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.