సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి పట్టణంలోని 17 18 వార్డుల్లో నిరుపేదలు అయ్యుండి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్డు గాంధీనగర్ ఏరియాలో సర్వే గురువారం సర్వే చేశారు. ఈ సర్వేలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, టౌన్ కార్యదర్శి ముమ్మడి పరమేశ్వరాచారి పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రధానంగా 17వ వార్డులో నివసించే వారికి చాలామందికి ఇందిరమ్మ ఇల్లకు అర్హులైన వారు ఉన్నందున వారికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు.
పాత ఇళ్లలో నివసించేవారు ఇల్లు శిధిలావస్థలో ఉన్నందున వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. ఇల్లు ప్లాటు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ కేటాయించాలన్నారు. 2006 సంవత్సరంలో చాలామందికి అర్హులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినా నేటి వరకు ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం గుర్తించి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. వార్డులో ప్రధాన సమస్యలు డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉన్నందున డ్రైనేజీ సమస్య సిసి రోడ్ల నిర్మాణం చేయాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవారి బతుకులు మారట్లేదు కిరాయి ఇళ్లకు కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్న బీదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించడమైనది .ఈ యొక్క కార్యక్రమంలో గాంధీనగర్ శాఖ కార్యదర్శి, జి, మదన్ ,రత్నయ్య,బాలస్వామి, గట్టయ్య ,మన్యం ,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
CPI(M): 17, 18 వార్డుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES