నవతెలంగాణ – బల్మూరు
అర్హులైన నిరుపేదల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించి గ్రామ ప్రజలచే వివిధ కాలనీలు పర్యటిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ తెలిపారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైలారం గ్రామంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు ఇల్లు రాలేదని గుర్తించడం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన దొడ్ల సత్యంతో పాటు పూరిగుడిసెలో నివాసం ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని అట్లాంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా నిరుపేదలను గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లు ఉండి కూడా ఇండ్లు మంజూరు చేసుకున్నారని ఆరోపించారు. పరిశీలనలో భాగంగా తమకు ఇండ్లు రాలేదని స్వయంగా గ్రామ ప్రజలు వివరించినట్లు తెలిపారు.
గ్రామంలో అకాల వర్షానికి పంటలు మొత్తం నష్టనష్టపరిహారంఇవ్వాలని ఇవ్వాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేయించి అర్హులైన వారికి ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మల్లయ్య, వెంకటయ్య, పాపయ్య, సత్యం గ్రామస్తులు ఉన్నారు. సీపీఐ(ఎం) పర్యవేక్షణలో భాగంగా మండలంలోని అంబగిరి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తించడం జరిగిందని అన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయాలని, లేని ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.