Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ చీరలు పంపిణీ

ఇందిరమ్మ చీరలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల 
మండల కేంద్రంలోని రాఘవపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ అంబాల కిరణ్ హాజరై గ్రామ దీపిక భూపెల్లి విజయ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పుట్టినరోజు పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.ఆయన ప్రారంభించిన పథకం వల్ల గ్రామంలో నా ఆడపడుచులకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ దీపిక భూపెళ్లి విజయ, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు ఆడబిడ్డలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -