Saturday, October 25, 2025
E-PAPER
Homeజిల్లాలుఆటంకం లేకుండా ఇందిరమ్మ ఇంటి బిల్లుల మంజూరు

ఆటంకం లేకుండా ఇందిరమ్మ ఇంటి బిల్లుల మంజూరు

- Advertisement -

లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు అవుతున్నాయని లబ్ధిదారులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు. శనివారం పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన గొల్ల శ్యామలమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. తనకు మొదటి విడత బిల్లు లక్ష రూపాయలు అందిందని రెండో విడత మరో రెండు మూడు రోజుల్లో అందరూ ఉన్నట్టు అధికారులు చెప్పారని శ్యామలమ్మ ఎమ్మెల్యేకు తెలిపారు. 

ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురుచూస్తున్న మాకు పదేళ్లుగా సహకారం కాలేదని నేడు ఇందిరమ్మ రాజ్యంలో మాలాంటి వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని విడతలవారీగా 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లోనే జమవుతాయని దళారులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు రమేష్ గౌడ్, బాలరాజు, మల్లేష్, నరసింహ,  యాదగిరి, సురేందర్ గౌడ్, వేణు గౌడ్ ,మన్యం, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -