నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని ఎంపీడీవో మోహన్లాల్ పేర్కొన్నారు. మండల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో ఉప్పునుంతల మండలం ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని తెలిపారు. శ్రమించి మొదటి స్థానానికి చేరాలని లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. మొదటి విడతలో మొత్తం 474 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 329 ఇళ్లకు మార్కింగ్ పూర్తయింది.
అందులో 68 ఇళ్లు బేస్ లెవెల్, 4 ఇళ్లు రూపులేవెల్, ఒక ఇల్లు స్లాబ్ లెవెల్ దశను పూర్తి చేశాయని, మొత్తంగా 73 ఇళ్లలో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇల్లు మంజూరైనా ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులు మహిళా సంఘాల్లో సభ్యులైతే రూ.1 లక్ష వరకు లోన్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎంపీడీవో మోహన్లాల్ సూచించారు. ఈ విధంగా ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను ఆయన కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES