Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి..

- Advertisement -

ఎంపీడీవో కృష్ణయ్య. 
నవతెలంగాణ – ఊరుకొండ 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. సోమవారం ఊరుకొండ  మండలం రాచాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్యాతాండా, మాదారం గ్రామాలను ఎంపీడీవో కృష్ణయ్య తమ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఇంకా మార్క్ ఔట్ ఇవ్వని లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పనులను ప్రారంభించాలని, బేస్మెంట్ పూర్తి కాని వారు త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలని, బేస్మెంట్ డబ్బులు వచ్చిన లబ్ధిదారులు గోడల పనులు రూఫ్ లెవెల్ వరకు పూర్తిచేసుకోవాలని సూచించారు. అలాగే ఎల్ 3 లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను తిరిగి వెరిఫికేషన్ చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు సాయి రూప, కృష్ణయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -