Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు అందని ఇందిరమ్మ ఇల్లు 

నిరుపేదలకు అందని ఇందిరమ్మ ఇల్లు 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండల కేంద్రంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు అందని ద్రాక్ష లాగా మిగిలినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రం సాకలి పెద్దలక్ష్మీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటాని స్థానిక నాయకులను ఎంతగా వేడుకున్న ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో ఆమెకు నిరాశ కల్పించారు. స్థానిక నాయకులు వారికి నచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించినట్టు తెలిపారు. మండలంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఎవరి నిర్మించుకుంటే వారికి ఇందిరమ్మ నిర్మాణ పత్రాలు అందించారు. కానీ మండల కేంద్రంలోని స్థానిక నాయకుల నిర్లక్ష్యంతోని నిరుపేదలకు ఇవ్వడంలో విఫలమైనట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

మండల కేంద్రంలో ఎంతోమంది రేకుల షెడ్డు కూలిపోయిన ఇల్లు తాడిపత్రిలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న వారికి నిరాశ కల్పించాలని స్థానిక నాయకులు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు .ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రజలలో నిరుత్సవం కల్పించినట్లు విమర్శిస్తున్నారు. ఇటువంటి సమస్య మండల కేంద్రంలోని కనిపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికార స్పందించి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు స్థానిక నాయకులు కూడా వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -