Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ మార్నింగ్ వాక్ లో పాల్గోన్నారు. సొంత గ్రామమైన సైదాపూర్ లో ప్రతి గల్లి తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై క్షేత్రస్థాయిలో పర్యటించి, వాటి పురోగతి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను తొందరగా నిర్మాణం చేయాలన్నారు. గత 10 సంవత్సరాలుగా మాటలకే పరిమితమై, ఏ ఒక్క గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేసి, పేదోడి సొంతింటి కలను నెరవేర్చకుండా గత ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. 

ప్రజా ప్రభుత్వం తెచ్చిన ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండి, ఆరు గారంటీ లను అమలు చేసుకుంటూ, పేదోడి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యం తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేశారని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలో 70% పూర్తయినాయి. రాష్ట్ర మొత్తం మీద నియోజకవర్గం ఐదో ప్లేస్ లో ఉన్నది. దానిని రెండో పేస్ కు తీసుకురావాలని కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రతివారం లో రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ గా మార్నింగ్ వాక్ లో పెద్ద గ్రామాలను సందర్శించి లబ్ధిదారులను మోటివేట్ చేసి, అవసరమైతే సంఘాల నుంచి కూడా రుణాలు ఇప్పిస్తామని, త్వరితగతిన బిస్మిట్ కంప్లీట్ చేసి, బేస్ మీద కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం అమౌంటు వేస్తామని ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు, ఇప్పుడు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల నాయకులు దుంబల వెంకటరెడ్డి, శిఖ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -