- Advertisement -
హైదరాబాద్ : భారతీయ రైల్వేలతో కలిసి ఇండోఫాస్ట్ ఎనర్జీ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో 25 రైల్వే స్టేషన్ల వద్ద 80 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ఇండోఫాస్ట్ ఎనర్జీ సీఈఓ అనంత్ బద్జాత్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కు సమీపంలో నూతన బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలల్లో మరో 40 స్టేషన్లు రానున్నాయన్నారు. స్వచ్ఛ ఇంధన మిషన్‌కు తోడ్పడుతూ విద్యుత్ వాహన వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.
- Advertisement -