ఎంపీల ప్రయోజనాలు రద్దు
కొనసాగుతున్న నిరసనలు..
ఆర్థిక మంత్రి ఇంటి లూటీ
జకార్తా : ఇండోనేషియా ప్రభుత్వం ప్రజాగ్రహానికి దిగొచ్చింది. పార్లమెంట్ సభ్యులకు అధిక జీతాలు, ఇంటి అద్దెలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆర్థిక మంత్రి ముల్యాని ఇంద్రావతి ఇంటిని కొందరు ఆందోళనకారులు లూటీ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో అధ్యక్ష భవనంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న జీతాలు, ఇంటి అద్దెలను తగ్గిస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంత్రి ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలో పరిస్థితుల రీత్యా చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు..
నిరసనలకు దిగొచ్చిన ప్రభుత్వం
ఆగస్టు 25వ తేదీన ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. పెద్ద ఎత్తున చెలరేగిన నిరసనలకు ఇండోనేషియా ప్రభుత్వం దిగివచ్చింది. పార్లమెంట్ సభ్యుల ప్రయోజనాలను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. ఆగేయాసియా దేశాల్లో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన దేశం ఇండోనేషియా. గత అక్టోబర్‌లో అధికారం చేపట్టిన ప్రబోవో సబియాంటో ఆర్థికవ్యవస్థ కుదేలైందని ప్రకటించారు. పేదల సంక్షేమానికి కోత పెడుతూ.. మరోవైపు 580 మంది పార్లమెంట్ సభ్యుల గృహ అలవెన్సులను 50 లక్షల రూపియాలకు (రూ.35,000లకు) పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఎంపీలు తీసుకుం టున్న నెలవారీ జీతం కోటి రూపాయలకు ఇది అదనం. సామాన్య పౌరుడి సగటు ఆదాయం కన్నా ఎంపీల గృహ అలవెన్సు 20 రెట్లు ఎక్కువ. ప్రభుత్వం పెంచిన తీరును ఇండోనేషియన్లు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించకపోతే దేశంలో అశాంతి తలెత్తె ప్రమాదముందని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి..
ప్రజాగ్రహానికి దిగొచ్చిన ఇండోనేషియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES