Thursday, August 7, 2025
E-PAPER
Homeబీజినెస్ఐపీఓ యోచనలో ఇండోసోల్‌

ఐపీఓ యోచనలో ఇండోసోల్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రయివేటు లిమిటెడ్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వచ్చే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న 1 గిగావాట్‌ఉత్పత్తి లైన్‌ ప్రారంభమైన తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సీఎండీ ఎన్‌ విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌ కింద ఇండోసోల్‌ సోలార్‌ గుర్తింపు పొందిందని తెలిపారు. రెండు విడతలలో మొత్తం రూ.5,175 కోట్ల ప్రోత్సాహకాలను అందుకున్నట్టు వెల్లడించారు. ఇండోసోల్‌, క్వార్ట్జ్‌ నుండి సోలార్‌ పివి మాడ్యూల్స్‌ వరకు పూర్తి సమగ్ర గిగా స్కేల్‌ సోలార్‌ పివి తయారీ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశ సోలార్‌ రంగంలో ప్రముఖ కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సమగ్ర తయారీ విధానం సోలార్‌ ప్యానెల్‌ ఉత్పత్తి ప్రక్రియలోని అన్ని దశలను కవర్‌ చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఇది తమ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు దేశీయ సోలార్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయనుందని తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -